జోడెడ్ల బండి
పల్లవి : జోడెడ్ల బండి కట్టి జోరుగాను పోతుంటే
పైరుగాలి వీచిందే మామ నా పైటంత సోకిందే మామ
జింగారె జింగ జింగారె జింగ జింగారె జింగారే
జింగారె జింగ జింగారె జింగ జింగారె జింగారే
ఆహాహా అ అ ఆ... ఓహోహో ఒ ఒ ఓ...
ఓలియ ఓలియ ఓలియ ఓలియ ఓలియ ఓలియ ఓలియ
చ1 : నింగిలోన సూరీడు నిక్కినిక్కి చూస్తుంటే
నీరెండ నాపైన నిలువెల్ల పడుతుంటే
వెచ్చంగ నా మనసు వేడెక్కిపోయిందే
ఆహాహా అ అ ఆ... ఓహోహో ఒ ఒ ఓ...
వెచ్చంగ నా మనసు వేడెక్కిపోయిందే
ఏదేదో అయ్యిందే మామ నా
యదంతా పులకరించే మామ || జింగారె ||
చ2 : కొమ్మమీద కోయిలమ్మ కొసరి కొసరి చూస్తుంటే
పూలపైన తుమ్మెదమ్మ మేలుపాట పాడుతుంటే
వింతైన ఊహలేవో విరివిగాను వస్తుంటే
ఆహాహా అ అ ఆ... ఓహోహో ఒ ఒ ఓ...
వింతైన ఊహలేవో విరివిగాను వస్తుంటే
ఎంతెంతో బాగుందే మామ ఇక
యనలేనిదీహాయి మామ || జింగారె ||
No comments:
Post a Comment