Wednesday, January 1, 2020

classical song - Pahi rama chandra lyrics with meaning


మూర్ఛన :        స    రి2    గ3   మ1   ప   ద2   ని3  స'
                          స'   ని3   ద2   ప   మ1   గ3   రి2  స

రాగం : శంకరాభరణం                            29 వ ధీర శంకరాభరణం మేళ
రచన : త్యాగరాజ స్వామి                        తాళం : ఆది తాళం

పల్లవి : 

పాహి రామచంద్ర పాలిత సురేంద్ర
పరమ పావన సద్గుణ గణ సాంద్ర       

చరణములు :

1.    నీరద నీల మునీంద్ర హృదయ
       నారద సేవిత సారస నయన                          || పాహి ||

2.   శ్రీకర రూప సుధాకర వదన
      శోక నివారణ సుందర రదన                            || పాహి ||

3.   నిర్మల రూప నిందిత మదన
      శర్మద సకలేశార్ణవ సదన                                 || పాహి ||

4.   రాజరాజ నుత రాఘవ త్యాగ-
      రాజ హృదాలయ రక్షిత నాగ                           || పాహి ||

భావము : 

పల్లవి : 

ఓ శ్రీరామ నీవు దేవతలకు చక్రవర్తివి. నీవు మహోన్నతమైన పూజ్యనీయుడవు.మంచి గుణాల సాంద్రత కలిగినవాడవు.నన్ను కరుణించు అని త్యాగరాజ స్వామి వారు వేడుకొంటున్నారు.

అర్ధాలు :
పాహి -  కరుణించు లేదా కాపాడు. (Save or mercy)
రామచంద్ర - చంద్రుని వంటి ముఖ అరవిందం కలిగిన రామ
పాలిత -  పాలించడం (rule)
సురేంద్ర - సురులు అనగా దేవతలు.ఇంద్ర అనగా చక్రవర్తి(రాజు). దేవతలకు రాజు అని అర్ధం.                     (Emperor of Gods.).

పరమ - ఎదురు లేని / మహోన్నతమైన(great).
పావన - పవిత్రుడు/పూజ్యనీయుడు(blessed/hallowed/purified/sacred).
సద్గుణ - మంచి గుణాలు.(good qualities)

1.
ఓ శ్రీరామా ! నీవు, నీలి మేఘాలవంటి దేహం కలిగి మునీంద్రుల హృదయాలలో కొలువైనవాడవు.నారదునిచే సేవింపబడేవాడవు. చంద్రునివంటి చల్లని కన్నులు కలవాడవు.(కలువవంటి కన్నులు కలవాడవు అని కూడా చెప్పవచ్చు).  నన్ను కరుణించు అని త్యాగరాజ స్వామి వారు వేడుకొంటున్నారు.

అర్ధాలు :
నీరద - మేఘాలు
సారస - హంస లేదా చంద్రుడు
నయనాలు - కన్నులు

Numerology:
Numerical for name నీరద is  1
Person with #1 as name numerical are Action oriented, pioneer, natural leader, independent, strong willed, positive, energetic, enterprising, enthusiastic, brave and innovative

2.
ఓ శ్రీరామా ! నీవు, వెంకటేశ్వరుని రూపంలో, చంద్రుని వంటి ముఖాన్ని కలిగినవాడవు.శోకాన్ని పోగొట్టి సంతోషాన్ని కలుగజేసేవాడవు. నన్ను కరుణించు అని త్యాగరాజ స్వామి వారు వేడుకొంటున్నారు.

అర్ధాలు :

శ్రీకర - వెంకటేశ్వర స్వామి
సుధాకరుడు - చంద్రుడు
వదన - ముఖం(face)
శోకం - దుఃఖం
రదన : సంతోషం(bringing joy or joyful).

3. ఓ శ్రీరామా ! నీవు, నిర్మలమైన రూపం కలిగినవాడవు. నిందలను పోగొట్టే శక్తి కలిగినవాడవు.
సర్వజనులకూ ఈశుడవై, పాలకడలిపై నివసించేవాడవు.నన్ను కరుణించు అని త్యాగరాజ స్వామి వారు వేడుకొంటున్నారు.

అర్ధాలు :

మదన - మన్మధుడు, పోగొట్టేవాడు
 శర్మద - ఆనందం, సంతోషం
సకల+ఈశ+అర్ణవ+సదన - 
ఈశ - దేవుడు
అర్ణవం - సముద్రం,సాగరం
సదన - నివాసం,నిలయం

4. ఓ శ్రీరామా ! నీవు,రాజాధిరాజువు. ఈ త్యాగరాజుని హృదయంలో కొలువై పూజింపబడేవాడవు.
నన్ను కరుణించు అని త్యాగరాజ స్వామి వారు వేడుకొంటున్నారు.

అర్ధాలు :

రాఘవ - రఘు వంశానికి చెందినవాడు. - శ్రీరాముడు
హృదయ + ఆలయహృదయం అనే కోవెల
నాగ - పూజ్యుడు


No comments:

Post a Comment

shakti sahita ganapathim lyrics in telugu

శక్తి సహిత గణపతిం  రాగం : శంకరాభరణం 29వ ధీర శంకరాభరణం మేళ తాళం : తిశ్ర ఏక రచన : ముత్తుస్వామి దీక్షితులు గ  గ   గ  మ గ   రి ...