ఘల్లు ఘల్లు గజ్జెలబండి
పల్లవి : కోనంగి గట్టున తుమ్మెద వంగి నాట్లేస్తున్నామె తుమ్మెద || 2 ||
ఒడ్డున ఉన్నాడె తుమ్మెద ఆ బుర్ర మీసాలోడె తుమ్మెదా || 2 ||
Mm... Mm ... Mm ... Mm...
గట్టూమీద ఎర్రాబొమ్మ పొద్దూపొడుపూ పొడవాలా
చెట్టూ పుట్టాలన్నీ తడవ వానాతల్లీ రావాల
వానతల్లీ రాకతోనే నల్లమబ్బూ మెరవాలా
ఇంటలొచ్చి కాలుపెట్టి సిరుల పంట పండాల
పండాల.. పండాల.. పండాల.. పండాలా ఆ..
అప: హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జెలబండీ
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
కొండకోన వాగులంట సాగేనండీ
ఆ. . . . . ఆ.. ఆ
ఈ గాలీ పాటల్లో ఈ నవ్వు బాటల్లో (2 times)
సాగింది నీలో నాలో సంబరాలు రేపుకుంటు
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ || ఘల్లు ఘల్లు ||
చ1 : ఈ పంటా సేనులన్నీ బంగారం పండెనివిగో
సిరు సెమటలు సిందె ఈ రైతూ మనవాడన్నా
పచపచ్చా పంటపొలమూ పాడిందో ఈ రాగం
ఈ ఏరువాకల సాగిందోయీ పల్లెజనము
ఈ రైతు బతుకుల్లోనా దీపాలు వెలిగే రోజూ
వస్తుంది వస్తుంది వసంతమల్లె తొందరలో
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ || ఘల్లు ఘల్లు ||
చ2: దేశానికీ వెన్నుముకై జీవించే పల్లెజనము
ధనధాన్యాలన్నీ పండించే దైవాలన్నా
నారులకూ నీరుపోసి అందరిలో సమత నింపి
ఏ కలతలు లేనీవారై మీరూ ఉండాలన్నా
ఈ రైతు బతుకుల్లోనా దీపాలు వెలిగే రోజూ
No comments:
Post a Comment