దుక్కి దున్ని నాడమ్మా
పల్లవి : దుక్కి దున్ని నాడమ్మా సందమామ రైతు
మొక్క నాటి నాడమ్మా సందమామ రైతు
అ.... ఆ.... ఆ.... ఆ ఆ ఆ
ఓ.... ఓ.... ఓ.... ఓ ఓ ఓ
చ1 : మండుటెండలో మలమల మాడిన తిండికి దొరకని రైతు బిడ్డడు
భార్యబిడ్డలను వెంట బెట్టుకొని కలుపు మొక్కలను సక్కగ బెరికి
సక్కనైన పంటను తెచ్చే సందమామ రైతు
సావుకారి బాకిని తీర్చే సందమామ రైతు
అ.... ఆ.... ఆ.... ఆ ఆ ఆ
ఓ.... ఓ.... ఓ.... ఓ ఓ ఓ || దుక్కి దున్ని ||
చ2 : పురుగు మందులను పంపున నింపి అడ్డంపడిన చెట్లను లేపి
సుమ్మిన వ్యాధితో సొమ్మసిల్లిన పంటచేలకు కంటి రెప్పయై
కష్టించి పైరును తెచ్చే సందమామ రైతు
పండించి ప్రజలకు పంచె సందమామ రైతు
అ.... ఆ.... ఆ.... ఆ ఆ ఆ
ఓ.... ఓ.... ఓ.... ఓ ఓ ఓ || దుక్కి దున్ని ||
చ3 : అన్నదాత వ్యవసాయ కార్మికుడు అప్పులలో పడి సతమతమౌతు
సిరిగిన బట్ట సింపిరి జుట్టు ఈసడించుకొని బీడుకుపోయి
మేలు రకములు అమ్ముతడమ్మా సందమామ రైతు
తాలు రకములు తింటాడమ్మా సందమామ రైతు
అ.... ఆ.... ఆ.... ఆ ఆ ఆ
ఓ.... ఓ.... ఓ.... ఓ ఓ ఓ || దుక్కి దున్ని ||
No comments:
Post a Comment