నోమినోమన్నాల తుమ్మీదలా
పల్లవి : నోమినోమన్నాల తుమ్మీదలా
నోమన్ననాలబాల తుమ్మీదలా
చ1 : అమ్మ కాకరచెట్టూ కింద తుమ్మీదలా
నేను కంచాలే దోముటుంటె తుమ్మీదల || 2 ||
అమ్మ ఆ ముండ కాకరాకు తుమ్మీదలా
నా కన్నుమీద పడ్డాదె తుమ్మీదల
నా కన్నోసి పోయిందే తుమ్మీదలా
నేనేమి సేతూనమ్మ తుమ్మీదల
ఆడు పక్కనే ఉన్నాడే తుమ్మీదలా
నన్ను పట్టించూ కోలేదె తుమ్మీదల || 2 || || నోమి ||
చ2 : అమ్మ బీరసెట్టు కింద తుమ్మీదలా
నేను బిందెలే దోముతుంటె తుమ్మీదల || 2 ||
అమ్మా ఆ ముండ బీరాకు తుమ్మీదలా
నా భుజం మీద పడ్డాదె తుమ్మీదల
నా భుజమోసి పోయిందే తుమ్మీదలా
నేనేమి సేతూనమ్మా తుమ్మీదల
ఆడు పక్కనే ఉన్నాడే తుమ్మీదలా
నన్ను పట్టించూ కోలేదె తుమ్మీదల || 2 || || నోమి ||
చ3 : అమ్మ సిక్కుడు సెట్టుకింద తుమ్మీదలా
నేను సిక్కులే ఇప్పుతుంటె తుమ్మీదల
అమ్మ ఆ ముండ సిక్కుడాకు తుమ్మీదలా
నా సెంపమీద పడ్డాదె తుమ్మీదల
నా సెంపోసి పోయిందే తుమ్మీదలా
నేనేమి సేతూనమ్మా తుమ్మీదల
ఆడు పక్కనే ఉన్నాడే తుమ్మీదలా
నన్ను పట్టించూ కోలేదె తుమ్మీదల || 2 || || నోమి ||
No comments:
Post a Comment