సేలన్నీ పండాలి
పల్లవి : సేలన్నీ పండాలి - సిరులెన్నో కురవాలి
రైతన్నల బతుకుల్లో - సిరుదివ్వెలు వెలగాలి
ఆ నింగి మెరుపులే - వాన చినుకులై - నేల తల్లినే తాకాలి
పసిడి పంటలే కనుల పండగై కనక వర్షమై కురవాలి
కష్టాలు పోవాలి నీ రాకతో - భూమాత నవ్వింది ఈ పాటతో
చ1 : కోయిలమ్మ నీ పాటలతో - కాడెద్దుల గంటల మోత
హొయ్ హొయ్ హొయ్ హొయ్
గట్టుమీద నడిచే భామల - హంస నడకల గజ్జెలమోత
హొయ్ హొయ్ హొయ్ హొయ్
ఏరువాకా సాగాలి - ఏకమయ్యి ఆడాలి
రైతులాగ రావాలి - పంటలన్నీ పండాలి
పారేటి సెలయేరు - మా పాడిపంటలు
జడి జడి వానల జల్లులతోనే నదులన్నీ పారాలి || కష్టాలు పోవాలి ||
No comments:
Post a Comment