రామ కోదండ రామ
రాగం : భైరవి రాగం తాళం : ఆది తాళం
రచన : త్యాగరాజ స్వామి నట భైరవి జన్యం
మూర్ఛన : స రి2 గ2 మ1 ప ద2 ని2 స'
స' ని2 ద1 ప మ1 గ2 రి2 స
పల్లవి : రామ కోదండ రామ
రామ కళ్యాణ రామ
చ1 : రామ సీతాపతి రామ నీవేగతి
రామ నీకు మ్రొక్కితి రామ నీ చేజిక్కితి || రామ ||
చ2 : రామ నీకెవరు జోడు రామ క్రీగంట జూడు
రామ నేను నీవాడు రామ నాతో మాటాడు || రామ ||
చ3 : రామ నామమే మేలు రామ చింతనే చాలు
రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు || రామ ||
చ4 : రామ నీకొక్క మాట రామ నాకొక్క మాట
రామ నీ పాటేపాట రామ నీ బాటేబాట || రామ ||
చ5 : రామ నేనెందైనను రామ వేరెంచలేను
రామ యెన్నడైనను రామ బాయగలేను || రామ ||
చ6 : రామ విరాజ రాజ రామ ముఖజిత రాజ
రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ || రామ ||
No comments:
Post a Comment