శ్రీ గణనాథ - మలహరి గీతం
రాగం : మలహరి రాగంతాళం : రూపక తాళం
రచన : పురంధర దాసు
మూర్ఛన : స రి1 మ1 ప ద1 స'
స' ద1 ప మ1 గ2 రి స
మ ప | ద స' | స' రి' || రి' స' | ద ప మ ప ||
శ్రీ . గ ణ నా థ సిం ధూ . ర వ ర్ణ
రి మ | ప ద | మ ప || ద ప | మ గ రి స ||
క రు ణ సా గ ర క రి వ దా . న
స రి | మా | గ రి || స రి | గ రి సా ||
లం . భో ద ర ల కు మి క రా
రి మ | ప ద | మ ప || ద ప | మ గ రి స ||
అం . బా . సు త అ మ ర వి ను త
మ ప | ద స' | స' రి' || రి' స' | ద ప మ ప ||
సి ద్ధ చ్ఛా . ర ణ గ ణ సే . వి త
రి మ | ప ద | మ ప || ద ప | మ గ రి స ||
సి ద్ధి వి నా య క తే . న మో న మో
మ ప | ద స | స రి || రి స | ద ప మ ప ||
స క ల వి ద్యా . ఆ ది పూ . జి త
రి మ | ప ద | మ ప || ద ప | మ గ రి స ||
స . ర్వో . త్త మ తే . న మో న మో
భావం :
వినాయకా! నీవు సింధూరం రంగు దేహం కలిగినవాడవు. సముద్రమంత కరుణ కలిగినవాడవు.ఏనుగు ముఖాన్ని, మరియు బొజ్జ కలిగినవాడవు. నీ చేతిలో లక్ష్మిని కలిగినవాడవు.నీవు పార్వతీదేవి పుత్రుడవు.ఎప్పటికీ దేవతలచే పూజించబడేవాడవు.
అర్ధాలు :
గణనాధుడు - వినాయకుడు
వర్ణం - రంగు
సాగరం - సముద్రం
కరి - ఏనుగు
వదన - ముఖం
లంభోదరుడు - వినాయకుడు
లకుమి - లక్ష్మి
కర - చేయి
అంబ - పార్వతీదేవి
సుతుడు - పుత్రుడు లేదా కుమారుడు.
No comments:
Post a Comment