నగుమోము గలవాని
రాగం : మధ్యమావతితాళం : ఆది తాళం
22వ ఖరహరప్రియ జన్యం
రచన : త్యాగరాజ స్వామి
మూర్ఛన : స రి2 మ1 ప ని2 స'
స' ని2 ప మ1 రి2 స
స్వరం :
నిసరీ రిసరిమపమ రమరిస
సారిస సనినిప నిసరిసరీ
రిమపాపప పనిపమ రిమరిస
నిసరీ మరి రిమపమ రిమరిస
పల్లవి :
నగుమోము గలవాని నామనోహరుని
జగమేలు శూరుని జానకీ వరుని
చరణములు :
1. దేవాధిదేవుని దివ్య సుందరుని
శ్రీవాసు దేవుని సీతా రాఘవుని
2. సుజ్ఞాన నిధిని సోమ సూర్యాలోచనుని
అజ్ఞాన తమమును అణచు భాస్కరుని
3. నిర్మలాకారుని నిఖిలాఘహరుని
ధర్మాది మోక్షంబు దయచేయు ఘనుని
4. బోధతో పలుమారు పూజించినేనా
రాధింతు శ్రీత్యాగరాజ సన్నుతుని
No comments:
Post a Comment