కోడిపిల్ల పాట
పల్లవి : ఆయిరాయిరే కోడిపిల్ల
కియామన్నదే కోడిపిల్ల ( 2 times)
చ1 : కోసిన కోడి తీసి ఈక తోక తీస్తుంటే
ఈ ఊరి కల్లాలు ఆ ఊరి కల్లాలు
మనూరి కల్లాలు ఎగిరొచ్చానన్నదే కోడిపిల్ల || ఆయిరాయిరే ||
చ2 : కిందన మంటెట్టి చిటాపటా కాలిస్తే
చాకలి పొయ్యికాడ చాకలి పొయ్యికాడ
చాకలి పొయ్యికాడ చలిమంటాలన్నదే కోడిపిల్ల || ఆయిరాయిరే ||
చ3 : దుక్కమీదెట్టి నేను దబాదిబా కొడుతుంటే
ఈ ఊరి దిబ్బలన్ని ఆ ఊరి దిబ్బలన్ని
మనూరి దిబ్బలన్ని ఎగిరొచ్చానన్నదే కోడిపిల్ల || ఆయిరాయిరే ||
చ4 : పొయ్యికింద పిడకెట్టి పొయ్యిమీద ఉడుకుతుంటే
ఈ ఊరి పొలిమేర ఆ ఊరి పొలిమేర
మనూరి పొలిమేర ఎగిరొచ్చానన్నదే కోడిపిల్ల || ఆయిరాయిరే ||
చ5 : ఉడికిన ముక్కతీసి ఊదుకోని తింటుంటే
నోట్లోకెల్లాక నోట్లోకెల్లాక
నోట్లోకెల్లాక మాటాడానన్నదే కోడిపిల్ల || ఆయిరాయిరే ||
No comments:
Post a Comment