ఇంజనీర్స్ డే సాంగ్
పల్లవి: చరితలోని సారమిదే భవితలోని భావమిదే
వీరగాథ విజయగాథ ఎన్ని విన్నా మూలమిదే
అ.ప : ఆఆ... ఆ...ఆ... ఆ అ అ ఆ అ అ
అ.ప : ఆఆ... ఆ...ఆ... ఆ అ అ ఆ అ అ
చ 1 : శ్రీనివాస దంపతులకు జన్మించిన జ్ఞానమా
విద్వాంసుల సైతం విద్యనేర్పిన బాల విశ్వేశ్వరుడు
యవ్వనముని భుక్తికోసం ధారవోసిన ధీరుడా
ఆఆ... ఆ...ఆ... ఆ అ అ ఆ అ అ || చరితలోని ||

చ 2 : శాస్త్రాన్ని ప్రజల కొరకు ప్రయోగించిన జ్ఞానమా
కనడనాథుని బృందవనిగ మలచిన విధాతరా
భాగ్యనగరము భవిత మార్చిన భవ్య భారత రత్నమా
ఆఆ... ఆ...ఆ... ఆ అ అ ఆ అ అ || చరితలోని ||
చ 3: జాతి మేధను తెల్లవారికి తెలియజేసిన తేజమా
గర్వమెరుగని నేతరా స్వార్ధమెరుగని మనిషిరా..
జీవనానికి సార్ధకమ్ము దేశ సేవేనంటు తెలిపి
నేటి యువతకు స్ఫూర్తినిచ్చి చిరంజీవుడైనాడురా..

No comments:
Post a Comment