వదినకు ఒకసారి
పల్లవి : వదినకు ఒకసారి బిందెకు బిగుసరిబంగారు జడకుచ్చుల మా వదిన మా బంగారు
జడకుచ్చుల మా వదిన || 2 ||
చ1 : గాలిలో ఉన్న ధూళిని చూసి
పౌడరు అంటది మా వదిన
నా ముఖానికంటది మా వదిన || వదినకు ||
చ2 : దారిలో ఉన్న పాముని చూసి
వడ్డాణమంటది మా వదిన
నా నడుముకి అంటది మా వదిన || వదినకు ||
చ3 : బస్సులొ ఉన్న డ్రైవర్ని చూసి
నా మొగుడంటది మా వదిన
బస్సు ఎక్కేయమంటది మా వదిన || వదినకు ||
చ4 : బావిలొ ఉన్న కప్పను చూసి
బోండాం అంటది మా వదిన
నన్ను తాగేయమంటది మా వదిన || వదినకు ||
E song ma chinnapptinundi vasthundhi.. Deeni memu video shoot cheddam anukuntunnam
ReplyDelete