మూర్ఛన : స రి2 గ3 మ1 ప ద2 ని3 స
'
స
' ని3 ద2 ప మ1 గ3 రి2 స
రాగం : శంకరాభరణం 29 వ ధీర శంకరాభరణం మేళ
రచన : త్యాగరాజ స్వామి తాళం : ఆది తాళం
పల్లవి :
పాహి రామచంద్ర పాలిత సురేంద్ర
పరమ పావన సద్గుణ గణ సాంద్ర
చరణములు :
1.
నీరద నీల మునీంద్ర హృదయ
నారద సేవిత సారస నయన ||
పాహి ||
2.
శ్రీకర రూప సుధాకర వదన
శోక నివారణ సుందర రదన ||
పాహి ||
3.
నిర్మల రూప నిందిత మదన
శర్మద సకలేశార్ణవ సదన ||
పాహి ||
4.
రాజరాజ నుత రాఘవ త్యాగ-
రాజ హృదాలయ రక్షిత నాగ ||
పాహి ||
భావము :
పల్లవి :
ఓ శ్రీరామ నీవు దేవతలకు చక్రవర్తివి. నీవు మహోన్నతమైన పూజ్యనీయుడవు.మంచి గుణాల సాంద్రత కలిగినవాడవు.నన్ను కరుణించు అని త్యాగరాజ స్వామి వారు వేడుకొంటున్నారు.
అర్ధాలు :
పాహి - కరుణించు లేదా కాపాడు. (Save or mercy)
రామచంద్ర - చంద్రుని వంటి ముఖ అరవిందం కలిగిన రామ
పాలిత - పాలించడం (rule)
సురేంద్ర - సురులు అనగా దేవతలు.ఇంద్ర అనగా చక్రవర్తి(రాజు). దేవతలకు రాజు అని అర్ధం. (
Emperor of Gods.).
పరమ - ఎదురు లేని / మహోన్నతమైన(great).
పావన - పవిత్రుడు/పూజ్యనీయుడు(blessed/hallowed/purified/sacred).
సద్గుణ - మంచి గుణాలు.(good qualities)
1.
ఓ శ్రీరామా ! నీవు, నీలి మేఘాలవంటి దేహం కలిగి మునీంద్రుల హృదయాలలో కొలువైనవాడవు.నారదునిచే సేవింపబడేవాడవు. చంద్రునివంటి చల్లని కన్నులు కలవాడవు.(కలువవంటి కన్నులు కలవాడవు అని కూడా చెప్పవచ్చు). నన్ను కరుణించు అని త్యాగరాజ స్వామి వారు వేడుకొంటున్నారు.
అర్ధాలు :
నీరద - మేఘాలు
సారస - హంస లేదా చంద్రుడు
నయనాలు - కన్నులు
Numerology:
Numerical for name నీరద is 1
Person with #1 as name numerical are Action oriented, pioneer, natural leader, independent, strong willed, positive, energetic, enterprising, enthusiastic, brave and innovative
2.
ఓ శ్రీరామా ! నీవు, వెంకటేశ్వరుని రూపంలో, చంద్రుని వంటి ముఖాన్ని కలిగినవాడవు.శోకాన్ని పోగొట్టి సంతోషాన్ని కలుగజేసేవాడవు. నన్ను కరుణించు అని త్యాగరాజ స్వామి వారు వేడుకొంటున్నారు.
అర్ధాలు :
శ్రీకర - వెంకటేశ్వర స్వామి
సుధాకరుడు - చంద్రుడు
వదన - ముఖం(face)
శోకం - దుఃఖం
రదన : సంతోషం(
bringing joy or joyful).
3. ఓ శ్రీరామా ! నీవు, నిర్మలమైన రూపం కలిగినవాడవు. నిందలను పోగొట్టే శక్తి కలిగినవాడవు.
సర్వజనులకూ ఈశుడవై, పాలకడలిపై నివసించేవాడవు.నన్ను కరుణించు అని త్యాగరాజ స్వామి వారు వేడుకొంటున్నారు.
అర్ధాలు :
మదన - మన్మధుడు, పోగొట్టేవాడు
శర్మద - ఆనందం, సంతోషం
సకల+ఈశ+అర్ణవ+సదన -
ఈశ - దేవుడు
అర్ణవం - సముద్రం,సాగరం
సదన - నివాసం,నిలయం
4. ఓ శ్రీరామా ! నీవు,రాజాధిరాజువు. ఈ త్యాగరాజుని హృదయంలో కొలువై పూజింపబడేవాడవు.
నన్ను కరుణించు అని త్యాగరాజ స్వామి వారు వేడుకొంటున్నారు.
అర్ధాలు :
రాఘవ - రఘు వంశానికి చెందినవాడు. - శ్రీరాముడు
హృదయ + ఆలయ - హృదయం అనే కోవెల
నాగ - పూజ్యుడు